7218 వాలంటీర్ పోస్టుల భర్తీకి జగన్ సర్కార్ ఆదేశాలు

-

నిరుద్యోగులకు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ అదిరిపోయే శుభ వార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి 7218 గ్రామ వాలంటీర్ పోస్టులు భర్తీ చేయాలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ ఖాళీలను భర్తీ చేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని పేర్కొంది జగన్ సర్కార్.

గ్రామ వాలంటీర్లు లేకపోవడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు ప్రక్రియ మందకోడిగా సాగుతుందని ప్రభుత్వం పేర్కొంది. దీన్ని నివారించడానికి నెలకు రెండు సార్లు ఖాళీ అయ్యే వాలంటీర్ల స్థానాలను భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా అందరు జాయింట్ కలెక్టర్లకు ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది.

ప్రతి నెల ఒకటో తేదీ, 16వ తేదీ ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియ చేయాల్సి ఉంటుంది. కొన్ని చోట్ల వాలంటీర్ నియామకానికి తగిన అర్హతలు కలిగిన అభ్యర్థులు లేకపోవడంతో ఇప్పటివరకు మనం లేదా అర్బన్ ఏరియా కు బదులు జిల్లా యూనిట్ గాతీసుకుని నియామకాలు పూర్తి చేయాలని ఆదేశించింది. అలాగే వాలంటీర్ల నియామకం చేసే సమయంలో 50 శాతం పోస్టులు మహిళలకు కేటాయించాలని సర్కార్‌ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news