ఢిల్లీలో ఈ నెల 24న చేపట్టనున్న ధర్నాకు అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించి రాష్ట్రంలో ఏం జరుగుతోందో వారికి వివరిద్దామని వైసీపీ ఎంపీలకు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ సూచించిన విషయం తెలిసిందే. ఏపీలో పరిస్థితులను అన్ని పార్టీలకు వివరించడంతో పాటు యావత్ దేశం దృష్టికి తీసుకెళ్లాలని.. పలు ఘటనలపై ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీ సమావేశాల్లో నిరసన వ్యక్తం చేస్తామని తెలిపారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి స్పందిస్తూ.. జగన్ అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీలో ధర్మా చేపడుతామని.. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని జగన్ కోరడం హాస్యస్పదంగా ఉందన్నారు హోంమంత్రి అనిత. వైసీపీ హయాంలో రాష్ట్రం పరిస్థితి ఏవిధంగా మారిందో అందరికీ తెలిసిందే. వైసీపీ నాయకుల తీరును ప్రజలు కూడా గమనిస్తున్నారు. మరోవైపు గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని.. చంద్రబాబుకి హెచ్చరికలు పంపుతామని జగన్ పేర్కొన్నారు. ఆయనకే మేము హెచ్చరికలు పంపుతున్నాం. అసెంబ్లీకి హాజరు కావాలని పేర్కొన్నారు మంత్రి అనిత.