హిందూ ధర్మం, ఆలయాల పరిరక్షణ పై మాట్లాడే హక్కు పవన్ కళ్యాణ్ కు లేదని జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాశీనాయన క్షేత్రాన్ని కూల్చుతుంటే పవన్ కళ్యాణ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని సోషల్ మీడియా వేదికగా నిప్పులు జరిగారు. ఆలయాల పట్ల మాకు ఉన్న చిత్తశుద్ధి… కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల నుంచే ఇదే కాశినాయన క్షేత్రంలో ఏం జరిగిందో రాష్ట్రం అంతా చూస్తోంది. ఒక ప్రసిద్ధ క్షేత్రంపై బుల్డోజర్లు నడిపి కిరాతకంగా, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, కలెక్టర్ ఆదేశాలతో, ఆర్డీఓ పర్యవేక్షణలో కూల్చివేస్తూ వచ్చారని ట్వీట్ చేశారు. చంద్రబాబు ఆదేశాలమేరకు, డిప్యూటీ సీఎం పర్యవేక్షణలో ఉన్న తన పర్యావరణ, అటవీశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇచ్చిన కూల్చివేత ఉత్తర్వులతో హిందూ ధర్మంపైన, ఆధ్యాత్మిక క్షేత్రాలపైన అధికార అహంకారంతో దాడిచేశారు. ఇవిగో ఆధారాలు, ఏమిటీ మీ సమాధానం? అని ప్రశ్నించారు.
నాకు వచ్చిన అర్జీ, దానికి సంబంధించిన విషయాలు విన్న తర్వాత ఈ ప్రభుత్వంపై నా కామెంట్ ఏంటంటే.., దేవుడు అంటే భక్తి, భయం ఉన్నది ఎవరికి? ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది? ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసిద్ధ కాశినాయన క్షేత్రంలో… pic.twitter.com/gTRsvBfnia
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 27, 2025