కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో పేర్ని నాని దిష్టిబొమ్మ దగ్ధం చేసారు జనసైనికులు. పవన్ కళ్యాణ్ పై పేర్ని నాని చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ పెనమలూరు నియోజకవర్గం ఆధ్వర్యంలో కంకిపాడులో పేర్ని నాని దిష్టిబొమ్మ ధగ్నం చేశారు. ఈ సందర్భంగా జనసేన లీడర్ ముప్పరాజ మాట్లాడుతూ.. వైసీపీ నాయకులు చేసిన తప్పిదం వల్ల తమ అధినాయకుడు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాడని.. మీరు చేసిన తప్పులు వల్ల ప్రజలందరికీ ఎటువంటి హాని కలగకూడదని ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టడం జరిగిందని తెలిపారు.
అలాగే కనకదుర్గమ్మ అమ్మవారి మెట్లు కడిగి మీ తరఫున క్షమాపణ కోరారని.. పేర్ని నాని హిందూ ధర్మ వ్యతిరేకి అని ప్రతి దేవుడిని కించపరిచే విధంగా మాట్లాడుతున్నా మానవ సైకో అని పేర్కొన్నారు. ఇంకొకసారి నోరు అదుపులో పెట్టుకోకుండా పవన్ కళ్యాణ్ మీద కానీ చంద్రబాబు మీద కానీ మాట్లాడితే ఈరోజు దిష్టిబొమ్మతో సరిపెట్టాము రేపు బందరు వచ్చి నిన్ను తగలబెడతామని హెచ్చరించారు జనసేన లీడర్.