జనసేన నేత పృథ్విరాజ్ లీలలు.. !

-

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన బాలిరెడ్డి పృథ్వీరాజ్‌కు విజయవాడకు చెందిన శ్రీలక్ష్మితో 1984లో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొంతకాలం సజవుగా సాగిన వీరికాపురంలో మనస్పర్ధాలు వచ్చాయి. దీంతో వీరిద్దరూ గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నారు. భార్య శ్రీలక్ష్మీ పిల్లలతో కలిసి తన పుట్టింట్లో ఉండసాగింది. భర్త నుంచి తనకు నెలకు రూ.8 లక్షల భరణం ఇప్పించాలంటూ శ్రీలక్ష్మి 2017లో కోర్టును ఆశ్రయించింది. తన వివాహం అనంతరం విజయవాడలో తన పుట్టింట్లోనే ఉంటూ చెన్నై వెళ్లి సినిమాల్లో అవకాశం కోసం ప్రయత్నించేవాడని, ఆసమయంలో అతని ఖర్చులన్నీ తమ పుట్టింటివాళ్లే భరించారని ఆమె కోర్టుకు తెలిపింది.

సినిమాల్లోకి వెళ్లాక పూర్తిగా మారిపోయిన ఆయన తనను తరచూ వేధించేవాడని కోర్టుకు విన్నవించింది. 2016 ఏప్రిల్‌ 5న ఇంట్లో నుంచి తనను వెళ్లగొట్టాడని, దీంతో అప్పటి నుంచి తన పుట్టింటిలోనే ఉంటున్నట్లు ఫిర్యాదులో ఆమె పేర్కొంది. సినిమాలు, టీవీ సీరియళ్ల ద్వారా నెలకు రూ.30 లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్లు అందులో తెలిపింది. భర్త నుంచి తనకు నెలకు రూ.8 లక్షల భరణం ఇప్పించాలని కోరింది.

అయితే ముఖ్యంగా సినిమాల్లోకి వెళ్లాక పృథ్వీరాజ్‌ రాసలీలలు ఎక్కువయ్యాయని.. అతడు కోర్టు ఆదేశాలను పాటించడం లేదని కోర్టు మండిపడుతూ.. అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version