విద్యా కానుక కిట్లను త్వరితగతిన పంపిణీ చేయాలి : సీఎం చంద్రబాబు

-

బాబు పాలనలో పగ, ప్రతీకారాలకు చోటుండదంటూ టీడీపీ తన అధికారిక వెబ్ సైట్ లో స్పష్టం చేసింది. ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా మాజీ సీఎం జగన్ బొమ్మ ఉన్న స్కూల్ బ్యాగులను ఈ ఏడాది తమ తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా పంపిణీ చేసేందుకు మార్గం సుగమం చేసింది. ముఖ్యంగా విద్యా కానుక కిట్లను ఆలస్యం చేయకుండా విద్యార్ధులకు త్వరితగతిన పంపిణీ చేయాలని ఆదేశించారు ఏపీ సీఎం చంద్రబాబు. స్కూల్ బ్యాగులపై పార్టీ రంగులు ఉన్నప్పటికీ వాటినీ కూడా పంపిణీ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం స్కూల్ బ్యాగులను పార్టీ రంగులతో ముద్రించినా వృధా చేయకుండా విద్యార్ధులకు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 36 లక్షల మంది విద్యార్ధులకు విద్యా కానుక కిట్లు పంపిణీ చేయాల్సిందిగా సూచించారు. విద్యా కానుక కిట్ల కోసం రూ. 700 కోట్లు వెచ్చించింది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికల షెడ్యూల్ విడుదల సమయంలో టెండర్లు పిలవటంతో స్కూలు బ్యాగులపై గుర్తులు ముద్రించలేదని తెలిపారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version