అమ్మ జేసీ… దివాకర్ ట్రావెల్స్ లో అంత జరిగిందా?

-

బీఎస్‌-3 వాహనాలను బీఎస్‌-4గా నమోదు చేయించుకోవడంతో పాటు… నకిలీ ఇన్‌ వాయిస్‌ లు, ఫేక్‌ ఇన్సూరెన్స్ ‌ల విషయలో ఇప్పటికే అడ్డంగా దొరికిపోయిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి.. స్క్రాప్‌ వాహనాల రిజిస్ట్రేషన్‌ కోసం చెన్నైకి చెందిన ముత్తుకుమార్‌ ను సంప్రదించి అనంతరం.. నాగాలాండ్‌ ఆర్టీఏ బ్రోకర్‌ సంజయ్‌ ద్వారా వీరు అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డిప్యూటీ ట్రాన్స్‌ పోర్ట్‌ కమిషనర్‌ శివరాంప్రసాద్ ఈ విషయాలపై మరిన్ని విషయాలు వెళ్లడించారు.

తాజాగా… దివాకర్‌ ట్రావెల్స్‌ అక్రమాలపై లోతుగా విచారణ చేస్తున్నట్లు తెలిపారు డిప్యూటీ ట్రాన్స్‌ పోర్ట్‌ కమిషనర్‌ శివరాంప్రసాద్‌. ఫోర్జరీ డాక్యుమెంట్లతో సుమారు 154 వాహనాలను అక్రమ రిజిస్ట్రేషన్‌ చేశారని తెలిపిన ఆయన… అందుకు సంబంధించిన 62 బస్సులు, లారీలను ఇప్పటికే అనంతపురం జిల్లాలో స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మిగిలిన వాహనాలను ఎక్కడ దాచారన్న సమాచారంపై విచారణ కొనసాగిస్తున్నామని… నకిలీ ఇన్ ‌వాయిస్‌, ఫేక్‌ ఇన్సూరెన్స్ ‌లపై కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు కమిషనర్ వెల్లడించారు.

ఇదే క్రమంలో… తప్పుడు పత్రాలతో 3 లారీలు అమ్మిన విషయంపై ఓర్వకల్లు పోలీసుల స్టేషన్‌ లో జేసీపై కేసులో… వాహనాలను చవ్వా గోపాల్‌రెడ్డి అనే వ్యక్తి, డ్రైవర్‌ నాగన్న పేరు మీద నకిలీ చిరునామాతో రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు పోలీసులు గర్తించారు. ఆ సంగతులు అలా ఉంటే… ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని.. కేవలం బ్రోకర్‌ ద్వారా వాహనాలను కొనుగోలు చేశామని జేసీ & కో బుకాయించడం కొసమెరుపు అంటున్నారు!

Read more RELATED
Recommended to you

Latest news