జేసీ వర్సెస్ పల్లె.. పుట్టపర్తిలో పోలీసుల అదుపులో జేసీ ప్రభాకర్ రెడ్డి

-

శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టిడిపికి చెందిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, అదే పార్టీకి చెందిన తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ల మధ్య నెలకొన్న వివాదమే ఈ ఉద్రిక్తతకు దారి తీసింది. చివరికి రంగంలోకి దిగిన పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది.

తాడిపత్రి నియోజకవర్గానికి చెందిన జేసీ ప్రభాకర్ రెడ్డి తన నియోజకవర్గమైన పుట్టపర్తి లోకి తన అనుమతి లేకుండా ఎలా వస్తారంటూ.. రఘునాథ్ రెడ్డి చాలా కాలం నుంచే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం సత్యసాయి జిల్లా కలెక్టర్ ను కలిసేందుకు జెసి పుట్టపర్తికి బయలుదేరారు. దీనిపై సమాచారం అందుకున్న పల్లె అనుచరులు భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేసేందుకు సిద్ధపడ్డారు. ఇరువర్గాల మధ్య గొడవ తప్పదన్న వాదనలు వినిపించాయి. ఈ పరిస్థితి పై సమాచారం అందుకున్న పోలీసులు పుట్టపర్తిలోనే జేసీ ని అదుపులోకి తీసుకొని పట్టణం నుంచి తరలించారు. దీంతో పరిస్థితి చల్లబడింది.

Read more RELATED
Recommended to you

Latest news