వచ్చే అసెంబ్లీ ఎన్నికల కల్లా… టిడిపి, జనసేన పార్టీల మధ్య పొత్తు కుదురుతుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టిడిపి, జనసేన పార్టీల మధ్య పొత్తు ఉంటే ముఖ్యమంత్రి ఎవరు అనే అంశంపై సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన తన అభిప్రాయాలను చెప్పుకొచ్చారు. ఒకవేళ రెండు పార్టీల మధ్య పొత్తు ఉండి అధికారంలోకి వస్తే రెండు మార్గాలు ఉన్నాయని చెప్పారు లక్ష్మీనారాయణ.
కొన్ని రోజులు వీళ్లు, మరికొన్ని రోజులు వాళ్లు అంటే రెండున్నర ఏళ్ళు ఒకళ్ళు, మరో రెండున్నర ఏళ్లు ఇంకొకరు ఉంటారని అభిప్రాయపడ్డారు. బీహార్, యూపీ, కర్ణాటకలో పార్టీలు పొత్తులు పెట్టుకున్న సమయంలో ఇదే జరిగిందన్నారు. కర్ణాటక, కాంగ్రెస్, జెడియు, మహారాష్ట్రలో శివసేన, బిజెపిలో కొన్ని స్ట్రాటజీలను ఫాలో అయ్యాయి అన్నారు. ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్లే ముఖ్యమంత్రి అవుతారని, ఆ తర్వాత సీట్లు వచ్చినవాళ్లు ఉపముఖ్యమంత్రి అన్నారు. అలాగే ఒకరు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పదవుల్ని తీసుకోవచ్చు అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కలుస్తారని అంటున్నారని, పొత్తులపై ఇంకా క్లారిటీ లేదు అన్నారు.