AP News : రాష్ట్రంలోని మరో 9 పట్టణాల్లో జియో 5జీ సేవలు

-

జియో 5జీ సేవలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రధాన నగరాలకు విస్తరించిన ఈ సేవలు తాజాగా తెలుగు రాష్ట్రాలకు కూడా చేరాయి. జియో తన 5జీ సేవలను దేశంలోని మరిన్ని నగరాలు/ పట్టణాలకు విస్తరించింది. నేటి నుంచి (మార్చి 21) మరో 16 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 41 నగరాలు/ పట్టణాల్లో ఈ సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా 406 నగరాలు/ పట్టణాల్లో జియో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చినట్లయ్యింది.

తాజాగా అందుబాటులోకి వచ్చిన 5జీ పట్టణాల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్‌ నుంచే 9 పట్టణాలు ఉన్నాయి.ఏపీలోని ఆదోని, బద్వేల్‌, చిలకలూరిపేట, గుడివాడ, కదిరి, నరసాపురం, రాయచోటి, శ్రీకాళహస్తి, తాడేపల్లిగూడెం పట్టణాల్లో జియో 5జీ సేవలు ప్రారంభించినట్లు ఆ సంస్థ తెలిపింది. గతంలో విజయవాడ, విశాఖ, తిరుమల, తిరుపతి, రాజమహేంద్రవరం, చిత్తూరు, కడప, నరసారావుపేట, శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు, కాకినాడ, కర్నూలు, గుంటూరు తదితర నగరాలు/ పట్టణాల్లో ఇప్పటికే 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. జియో అందిస్తున్న 5జీ సేవలు అందుకోవడానికి 5జీ సపోర్ట్‌ కలిగిన హ్యాండ్‌సెట్‌ ఉంటే సరిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news