మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆగస్టు 11న భోళాశంకర్ రిలీజ్

-

గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు చేస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ మెగాస్టార్ దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం భోళాశంకర్ సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఈ చిత్రం రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. తాజాగా మెగా అభిమానులకు ఈ చిత్రబృందం సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ చెప్పింది. అదేంటంటే..?

భోళాశంకర్ సినిమా రిలీజ్ డేట్ ను చిత్రబృందం ఫైనల్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది ఆగస్టు 11న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సినిమాలో చిరంజీవి సోద‌రిగా మహానటి కీర్తిసురేష్ న‌టిస్తోంది. ఈ మూవీలో చిరుతో త‌మ‌న్నా రొమాన్స్ చేస్తోంది.  అజిత్ హీరోగా త‌మిళంలో విజ‌య‌వంత‌మైన వేదాళం ఆధారంగా భోళాశంక‌ర్ సినిమా రూపొందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news