చంద్రబాబుకు విషెష్ తెలిపిన జూనియర్ ఎన్టీఆర్

-

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నటుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రియమైన చంద్రబాబు మామయ్యకు ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించినందుకు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తారని ఆశిస్తున్నాను. అద్భుతమైన మెజార్టీతో గెలిచిన నారా లోకేష్, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీలుగా గెలిచిన భరత్ కి, పురందేశ్వరీ అత్తకు.. అలాగే పీఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి నా శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు జూనియర్ ఎన్టీఆర్. ఎన్నికల ముందు సైలెంట్ గా ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు ట్వీట్ చేయడంతో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ కూడా వీరికి శుభాకాంక్షలు తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Latest news