స్టీల్ ప్లాంట్ కొనే కెపాసిటీ నా ఒక్కడికే ఉందని వెల్లడించారు కేఏ పాల్. అన్ని పార్టీలు కలిసి వస్తే… స్టీల్ ప్లాంట్ ను కొందామని ప్రకటించారు. నర్సీపట్నంలో ఉన్న తన తండ్రిని చూసేందుకు వచ్చిన కె ఏ పాల్.. తిరిగి వెళుతూ మార్గమధ్యలో మీడియాతో మాట్లాడారు.
స్టీల్ ప్లాంట్ కొనే స్తోమత నా ఒక్కడికే ఉందని వివరించారు కేఏ పాల్. ఏడాది కాలంగా కమిటీలను లెటర్ ఇమ్మని అడుగుతున్నానని చెప్పారు. చంద్రబాబు, జగన్ లు ఇద్దరూ పరిపాలనలో ఫెయిలయ్యారన్నారు. నన్ను సీఎం చేస్తే అమరావతి పూర్తి చేస్తానని వెల్లడించారు. నేను ఈ ప్రాంతంలో పుట్టి.. అభివృద్ధి చేసిన వాడినని.. సింగరేణిని కాపాడుకోలేని కెసిఆర్ స్టీల్ ప్లాంట్ ని ఎలా కొనగలడా? అని ప్రశ్నించారు కేఏ పాల్.