ఆడియో క్లిప్ పంపితే, ఫోన్ ట్యాపింగ్ అని శ్రీధర్ రెడ్డి రచ్చ చేస్తున్నారని ఏపీ మంత్రి కాకాణి కౌంటర్ ఇచ్చారు. కోటం రెడ్డి శ్రీధర్‌రెడ్డి చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు చేశారు కాకాణీ.
శ్రీధర్‌రెడ్డి చెప్పింది అబద్ధమని రామశివారెడ్డి స్పష్టంగా చెప్పారన్నారు.. అది ఫోన్ కాల్ రికార్డ్ మాత్రమే అని రామశివారెడ్డి చెప్పారని గుర్తు చేశారు. నమ్మి ఆడియో క్లిప్ పంపితే, ఫోన్ ట్యాపింగ్ అని శ్రీధర్‌రెడ్డి రచ్చ చేస్తున్నారని నిప్పులు చెరిగారు మంత్రి కాకాణి. ఎన్నికల్లో శ్రీధర్ రెడ్డికి తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు.
ఇక అటుఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అభద్రతాభావంలో ఉన్నారు.. ఫోన్లు మాట్లాడుకునే ధైర్యం చేయలేకపోతున్నారని బాంబ్ పేల్చాడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. విచారణ జరిపితే మిగిలినవారి ట్యాపింగ్ బయటపడుతుందన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. సజ్జల నా మిత్రుడికి ఇవ్వాల్సిన స్క్రిప్ట్ సరిగా ఇవ్వలేకపోయారు.. కేంద్రహోంశాఖను విచారణ కోరేందుకు ఎందుకు వెనుకాడుతున్నారని ఆగ్రహించారు. మరో 6 నెలల తర్వాత చిత్రవిచిత్రాలు చూస్తారన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.