పర్యాటక ప్రాజెక్టులను వేగంగా చేపట్టాలి: మంత్రి రోజా

-

రాష్ట్రంలో పర్యాటకానికి అనువైన ప్రాజెక్టులను వేగంగా చేపట్టాలని పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆమె.. ఆధ్యాత్మిక పర్యాటకంలో భాగంగా దర్శనీయ ప్రదేశాలకు ప్రత్యేక టూర్లు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. పర్వతారోహకురాలు ఆశ మాలవీయ సచివాలయంలో మంత్రి రోజాను కలిశారు. మాలవీయ లక్ష్యం నెరవేరాలని మంత్రి ఆకాంక్షించారు.

రాష్ట్రంలో వివిధ అనువైన పర్యాటక అభివృద్ధి స్థలాలపై చర్చించారు. దర్శనీయ ప్రదేశాల పర్యాటక అభివృద్ధిపై సమీక్షించి దానికి సంబంధించి సమస్య పరిష్కార మార్గాలను సూచించారు.పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధి నిమిత్తం వివిధ శాఖల దగ్గర ఉన్న ప్రాజెక్టుల వివరాలు స్థితిగతులు చర్చించారు.ఆయా శాఖలతో సమీక్షించి వెంటనే ప్రాజెక్ట్లను చేపట్టేలా అధికారులు కు సూచించారు.ప్రస్తుతం జరుగుతున్న పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టుల టెండర్స్ స్థితిగతులను సమీక్షించారు.రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులు మంత్రులు మరియు శాసనసభ్యులు అడిగిన ప్రతిపాదనలు స్థితిగతులను సమీక్షించారు.ప్రజా ప్రతినిధులు ఇచ్చిన ప్రతిపాదనలను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అధికారులను సూచించారు.కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రసాద్ పథకం కింద రాష్ట్రం నుండి పంపిన ప్రతిపాదన వివరాలు,ఆమోదించిన ప్రాజెక్టుల వివరాలు చర్చించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news