చంద్రబాబు అరెస్ట్.. నేడు కాంతితో క్రాంతి కార్య‌క్రమం

-

చంద్రబాబు అరెస్ట్‌ తరుణంలో.. మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది టీడీపీ పార్టీ. నేడు గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపిద్దాం అంటూ క్రాంతితో క్రాంతి వినూత్న నిరసనకు టీడీపీ పిలుపు నిచ్చింది. ఇవాళ రాత్రి 7 గంటలకు సెల్‍ఫోన్ టార్చ్ లేదా కొవ్వొత్తులు వెలిగించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపు నిచ్చారు.

Kantito Kranti in support of Chandrababu
Kantito Kranti in support of Chandrababu

ఇళ్లలో లైట్లు ఆర్పి బయటకు వచ్చి ఐదు నిమిషాలు లైట్లు వెలిగించాలని పిలుపు నిచ్చారు. రోడ్డుపై ఉంటే వాహనాల లైట్లు బ్లింక్ కొట్టాలని నారా లోకేష్ పిలుపు నిచ్చారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా నిర్వహించాలని నారా లోకేష్ పిలుపు నిచ్చారు.

కాగా, నేటికి 28వ రోజుకు రాజమండ్రి సెంట్రల్ జైలులోని టిడిపి అధినేత చంద్రబాబు రిమాండ్ చేరింది. స్కిల్ డవలప్ మెంట్ స్కాం కేసులో గత నెల 9వ తేదీన అరెస్టయిన చంద్రబాబు…28 రోజులుగా జైలులోనే ఉంటున్నారు. ఈ నెల 19వ తేదీ వరకు చంద్రబాబు రిమాండ్ కొనసాగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news