విజయవాడ ఎంపీ సీటు కావాలని తాను అడగలేదని కేశినేని శివనాథ్(చిన్ని) వెల్లడించారు. ‘టికెట్ల అంశం అధిష్టానం చూసుకుంటుంది. సీటు ఎవరికి ఇచ్చిన విజయవాడలో టిడిపి గెలుపు ఖాయం. 175 నియోజకవర్గాల్లో 160 చోట్ల టిడిపి-జనసేన అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యం. చంద్రబాబును సీఎం చేసేలా కృషి చేస్తాం. ప్రతి కుటుంబంలో ఉండే చిన్న చిన్న సమస్యలు త్వరలోనే తీరుతాయి. అందరం కలిసి పనిచేస్తాం’ అని చిన్ని పేర్కొన్నారు.
ఇక అటు టీడీపీ పార్టీ జోలికి ఇక అస్సలు వెళ్ళను అని ప్రకటించారు కేశినేని నాని. తాజాగా కేశినేని నానికి చంద్రబాబు బిగ్ షాక్ ఇచ్చారు. ఎంపీ కేశినేని నానికి క్లారిటీ ఇచ్చేసారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. బెజవాడ ఎంపీ టిక్కెట్ ను వేరే వారికి కేటాయిస్తున్నట్టు స్ఫష్టం చేశారు చంద్రబాబు నాయుడు. ఇదే విషయాన్ని తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసారు ఎంపీ కేశినేని నాని. తిరువూరు ఘటన తర్వాత క్లారిటీ ఇచ్చేసిన టీడీపీ అధిష్టానం… బెజవాడ ఎంపీ టిక్కెట్ ను వేరే వారికి కేటాయిస్తున్నట్టు స్ఫష్టం చేసింది.