చంద్రబాబు, రజినీకాంత్‌లకు భవిష్యత్ లేదని ఫైర్ అయ్యారు కొడాలి నాని. వారిద్దరికీ ఆసుపత్రుల చుట్టూ తిరగడంతోనే సరిపోతుంది.. చంద్రబాబుకు, జగన్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.. 2300 మంది ఆర్టీసీ కుటుంబాలను చంద్రబాబు గాలికొదిలేసాడని ఆగ్రహించారు కొడాలి నాని. చంద్రబాబు ఒక ఎకరం ల్యాండు కొని మంచి నీటి అవసరాలు తీర్చాడంటే నేను వెళ్ళిపోతాననని.. విమర్శలు చేశారు.
గుడివాడలో చక్రాలు, బొంగరాలు 14 ఏళ్ళు తిప్పిన చంద్రబాబు ఏం చేయ లేకపోయాడని మండిపడ్డారు. మొన్న సిగ్గులేకుండా చంద్రబాబు మాట్లాడాడు..టిడ్కో ఇళ్ళు రాజశేఖరరెడ్డి ఇచ్చిన స్ధలంలో కట్టినవేనన్నారు. ఎవడో వచ్చాడు.. ఏదో చేస్తాడు.. అనేది ఎప్పుడూ జరిగేదేని…ఎవడూ ఏకగ్రీవంగా గెలవడు.. మంత్రి చేసినా, ఐదోసారి గెలిచినా నా పేరు చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు కొడాలి నాని.