నూతన సచివాలయం వద్ద ఉద్రిక్తత

-

కాసేపట్లో తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభానికి సీఎం కేసీఆర్ అక్కడికి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో సచివాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉద్యోగుల వాహనాలను లోపలికి అనుమతించడం లేదు పోలీసులు. దీంతో ఉద్యోగులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే పోలీసులు మాత్రం లోపల పార్కింగ్ ఫుల్ అయిందని.. నడిచి వెళ్లాలని ఉద్యోగులకు సూచించారు. దీంతో ఉద్యోగులు మండిపడుతున్నారు.

మరోవైపు సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కొన్ని ఎంపిక చేసిన పత్రికలు, టీవీ చానల్స్ కి మాత్రమే ఎంట్రీ ఇస్తున్నారు పోలీసులు. భారీ స్థాయిలో వాణిజ్య ప్రకటనలను మీడియా సంస్థలకు ఇచ్చింది ప్రభుత్వం. కానీ కవరేజ్ విషయంలో మాత్రం పరిమిత సంఖ్యలోనే పాసులను ఇచ్చారు. దీంతో జర్నలిస్టుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అయింది. ఇక కాసేపట్లో సచివాలయానికి చేరుకోనున్న కేసీఆర్.. ప్రధాన ప్రవేశ గేటు వద్ద పూజ చేసి తర్వాత హోమశాల వద్ద యాగపూర్ణాహుతిలో పాల్గొంటారు. అక్కడి నుంచి ప్రధాన ద్వారం వద్దకు చేరుకొని సచివాలయం ప్రారంభిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news