ఎమ్మెల్యే భర్త అరెస్ట్.. వైసీపీలో చేరనందుకేనన్న లోకేష్

-

రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే భవాని భర్త ఆదిరెడ్డి వాసును సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. వాసుతోపాటు ఆయన తండ్రి అప్పారావును కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. జగజ్జనని అనే చిట్ ఫండ్ వ్యవహారాలలో అవకతవకల ఆరోపణలపై సిఐడి కేసు నమోదు చేసింది. దీంతో వారిని అరెస్టు చేసి సిఐడి కార్యాలయానికి తరలించారు. ఎమ్మెల్యే భవాని.. దివంగత టిడిపి నేత ఎర్రనాయుడు కూతురు అలాగే ఎంపీ రామ్మోహన్ నాయుడు సోదరి అనే విషయం తెలిసిందే.

అయితే వాసు అరెస్టుపై స్పందించారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందిస్తూ.. “ఒక కన్నుని పొడిచిన మరో కన్నుని సిబిఐ అరెస్ట్ చేసే వేళ, ఆదిరెడ్డి కుటుంబాన్ని సిఐడి అదుపులోకి తీసుకోవడం జగన్ స్టైల్ డైవర్షన్ డ్రామా. ఫిర్యాదులు లేని కేసుల్లో బిసి టిడిపి నేతలైన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసులని అదుపులోకి తీసుకోవడం ఏ1 దొంగ పాలనలోనే సాధ్యం. వైసిపిలో చేరలేదనే అక్కసుతో బీసీ నేతలైన ఆదిరెడ్డి కుటుంబంపై కక్ష కట్టడం దారుణం. ఆదిరెడ్డి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది” అని భరోసా ఇచ్చారు లోకేష్.

Read more RELATED
Recommended to you

Latest news