జగన్ జోలికి వస్తే ఎవరినైనా చీల్చి చెండాడతా – కొడాలి నాని

-

మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడలో మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయంగా చిరంజీవిని విమర్శిస్తే ఏం జరుగుతుందో తనకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. చిరంజీవిని తాను విమర్శించినట్లు నిరూపించాలని చాలెంజ్ విసిరారు కొడాలి. చిరంజీవిని విమర్శించే సంస్కారహీనుణ్ణి కాదన్నారు. డాన్సులు, నటన చేతగాని ఇండస్ట్రీలోని పకోడీ గాల్లకు చిరంజీవి సలహాలు ఇవ్వాలని అన్నానన్నారు.

ఈ వ్యాఖ్యలు చిరంజీవి గురించి మాట్లాడినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు. తాను శ్రీరామ అన్నా.. తెలుగుదేశం, జనసేన పార్టీలకు బూతు మాటలు లాగానే వినబడతాయన్నారు. ఇక జగన్ గురించి మాట్లాడితే ఎవరినైనా చీల్చి చెండాడుతానని హెచ్చరించారు. టిడిపి, జనసేన శ్రేణులు గుడివాడ రోడ్ల దొర్లారని.. చిరంజీవికి, తమకు మధ్య అగాధం సృష్టించాలని ఆ రెండు పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news