భువనేశ్వరి ఆస్తి 627 కోట్లు, చంద్రబాబు ఆస్తి 20 కోట్లు అని కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న చంద్రబాబు చేసిన కామెంట్లకు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు భార్య ఆస్తి బయట పెట్టరని ఫైర్ అయ్యారు కొడాలి నాని. జగన్ దంపతుల ఆస్తి కంటే, చంద్ర బాబు ఆస్తి ఎక్కువ అన్నారు.భార్య ఆస్తి కలిపి కూడా చెప్పుకోలేని దారుణమైన వ్యక్తి చంద్రబాబు అని విమర్శలు చేశారు.
దేవుడి దయవల్ల 2004, 2009లో నన్ను గెలిపించాలి అని చంద్రబాబు అనలేదు కాబట్టి నేను గెలిచానన్నారు. 2014లో అవినాష్ ను గెలిపించాలని కోరితే ఓడించారని పేర్కొన్నారు. చంద్ర బాబు జిత్తుల మారి నక్క.. చంద్ర బాబు గుడివాడ కు చేసింది ఏమీ లేదని విమర్శలు చేశారు కొడాలి నాని. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు గుడివాడ కు ఏం చేశారన్నారు.
కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలకు మద్దతు పలికిన చంద్రబాబు ఎందుకు ఇక్కడ ఫ్లై ఓవర్లు కట్టలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. గుడివాడ ఎన్టీఆర్ పుట్టిన గడ్డ అని చంద్రబాబు ఇపుడు దొంగ ప్రేమ ఒలక పోస్తున్నారు.. గుడివాడ నియోజక వర్గంలో ఫ్లై ఓవర్లు, రోడ్లు, పేదలకు ఇళ్లను కడుతూ అభివృద్ధి చేస్తున్నామన్నారు.