ఏపీలో ఏప్రిల్, మే నెలలోనే ఎన్నికలు జరుగుతాయని ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని వెల్లడించారు. కేంద్రం జమిలి ఎన్నికలకు సిద్ధమైతే తాము సిద్ధమేనని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. కేంద్రం జమిలి ఎన్నికలకు వెళ్తుందని తాము భావించట్లేదని చెప్పారు. ఏప్రిల్, మే నెలలోనే ఎన్నికలు జరుగుతున్నాయని, ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన తమకు లేదని తెలిపారు. ఎమ్మెల్యేలు జాగ్రత్తగా లేకపోతే టికెట్ ఇవ్వమని సీఎం జగన్ చెప్పారని నాని వివరించారు.
కాగా జైల్లో ఉంటే దొమలు కుట్టక…రంభ, ఊర్వశీ, మేనకలు కన్ను కొడతారా..? అంటూ చంద్రబాబుకు నిన్న కౌంటర్ ఇచ్చారు కొడాలి నాని. చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరీలపై కొడాలి నాని సెటైర్లు పేల్చారు.చంద్రబాబు అరెస్ట్ అయితే లోకేష్ తిరునాళ్లల్లో తప్పిపోయిన పిల్లాడిలా బిత్తర చూపులు చూశాడని.. పీకండి.. కొట్టండి.. జైల్లో పెట్టండి.. నిరూపించండి అన్నాడు.. ఇప్పుడు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడని మండిపడ్డారు. నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని.. కేసు పెట్టాల్సిన అవసరం ఏముంది..? రాత్రికి రాత్రి 2 వేల పేజీలతో మెమోలు తయారు చేస్తారా..? అని ప్రశ్నించారు.