తండ్రి కేసును టేకప్ చేస్తే కుమారుడి కేసు ఫ్రీ : విజయసాయిరెడ్డి సెటైర్లు

-

తండ్రి కేసును టేకప్ చేస్తే కుమారుడి కేసు ఫ్రీ అంటూ ఏపీ వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి సెటైర్లు వేసారు. తండ్రికొడుకుల ఆట ముగిసిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ‘తండ్రి ఎలాగో… కుమారుడు అలాగే! ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాంలో లోకేష్ A-14గా చేరారు. ఇప్పుడు లోకేష్ ఢిల్లీలో లాయర్లకు buy-one-get-one-free-scheme ఆఫర్ ఇవ్వాలి.

vijayasai reddy on cbn

తండ్రి కేసును టేకప్ చేస్తే కుమారుడి కేసు ఫ్రీగా పొందవచ్చు. వారిద్దరి పని ముగిసింది’ అని విజయసాయి ట్వీట్ చేశారు. రాజమండ్రిలో చంద్రబాబు గారి కుటుంబసభ్యుల పరామర్శలో సింపతీ ఏరులై పారేలా రక్తికట్టించడానికి డబ్బిచ్చి జనాన్ని తీసుకొస్తున్నారని మరో ట్వీట్‌ లో పేర్కొన్నారు విజయసాయిరెడ్డి. ఇది వాళ్లకు కొత్తేం కాదు. డబ్బు వెదజల్లితే ఏ పని అయినా జరిగిపోతుందని ఇప్పటికీ, ఎప్పటికీ గట్టిగా నమ్మే పార్టీ టీడీపీ. ఆ పార్టీ పునాదులే దోపిడీపైన ఏర్పడ్డాయని సెటైర్లు పేల్చారు విజయసాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version