వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి జగన్‌కు నమ్మినబంటుగా ఉన్న కోటంరెడ్డి శ్రీదర్‌రెడ్డి…కొంతకాలంగా పార్టీ అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి జరగడం లేదంటూ ఇటీవల కాలంలో బహిరంగంగానే విమర్శలు చేశారు. తన ఫోన్ ట్యాంపింగ్ చేస్తున్నారని..తాను ఎవరెవరితో మాట్లాడుతున్నానో రహస్యంగా వింటున్నారని ఆయన ఆరోపించారు. అధికారపార్టీ ఎమ్మెల్యేనైన తన ఫోను ట్యాప్ చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఫోన్ ట్యాంపింగ్ సంబంధించిన సాక్ష్యాలు తన వద్ద ఉన్నాయన్నారు.
‘నా ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారాలను బయటపెట్టానంటే రాష్ట్ర ప్రభుత్వం షేక్ అవుతుంది.. ఇద్దరు ఐపీఎస్ అధికారుల ఉద్యోగాలూ పోతాయ్.. కేంద్ర ప్రభుత్వమే విచారణకు దిగుతుంది’ అని నెల్లూరు గ్రామీణ వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వమే తన ఫోన్ ట్యాపింగ్ చేస్తుందన్న విషయాన్ని రెండు రోజుల క్రితం బయటపెట్టిన ఆయన.. ఇక వైసీపీలో ఇమడలేనంటున్నారు. తన కార్యకర్తలతో సమావేశం సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో ఒకటి మంగళవారం బయటకొచ్చింది.