జగన్ సర్కార్‌ కు కోటంరెడ్డి రిటర్న్‌ గిఫ్ట్‌..గన్‌మెన్లను వెనక్కి పంపేశాడు !

జగన్ సర్కార్‌ కు నెల్లూరు రూరల్ ఎం.ఎల్.ఏ. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చాడు. నాకు గన్‌మెన్లు తగ్గించిన సర్కార్‌కు నేను రిటర్న్‌ గిఫ్ట్ ఇస్తున్నా.. ఇద్దరు గన్‌మెన్లను తొలగించారు, మిగిలిన ఇద్దరు గన్‌మెన్లు నాకొద్దు.. గన్‌మెన్లను తొలగించినంత మాత్రాన నేను భయపడనని స్పష్టం చేశారు.

నాగొంతు పెరిగేదే తప్ప తగ్గేది లేదన్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. మా బావ కాకాణి ని నాలుగు ప్రశ్నలు అడుగుతే 40 తిట్లు తిట్టారని..ఆయన తిట్లకు మళ్లీ సమాధానం చెబుతానని వెల్లడించారు. నాకు ఉన్న నలుగురు గన్ మెన్ లలో ఇద్దరిని తొలగించారని..పోలీస్ కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయని చెప్పారని వివరించారు.

నాకు చాలా చోట్ల నుంచి నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని..నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టేందుకే ఇలా చేశారని ఆగ్రహించారు. నాకు గన్ మెన్ లు అక్కర లేదు…నన్ను ఏమైనా చేసుకోండని…రోజు రోజుకూ నా గొంతు వినిపిస్తూనే ఉంటానని హెచ్చరించారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఎంత దూరమైనా వెళతా..గన్ మెన్ లను తొలగించి నంత మాత్రాన నన్ను మానసికంగా ఏమీ చేయలేరని…తగ్గేదే లేదన్నారు.

ఆ స్టార్ హీరోల తో తమన్నా ఆ తప్పు చేసిందా?.. అందుకే భయపడుతుందా?