శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ఆపేయాలని తెలుగు రాష్ట్రాలకు సీఈ లేఖ..!

-

శ్రీశైలం ప్రాజెక్టులో జల విద్యుత్ ఉత్పత్తి ఆపేయాలని తెలుగు రాష్ట్రాల జెన్ కో లకు కర్నూలు సీఈ లేఖ పంపింది. రాయలసీమ రైతుల ప్రయోజనాల దృష్ట్యా జల విద్యుత్ ఆపాలని సీఈ కబీర్ బాషా లేఖలో పేర్కొన్నారు. అయితే ఇక్కడ జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా 68, 980 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు దీంతో శ్రీశైలం ప్రాజెక్టులో రోజుకు 6.25 టీఎంసీల నీరు తగ్గిపోతుంది. ఈ కారణంగానే కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి ఆపేయాలని తెలుగు రాష్ట్రాలకు కర్నూలు సీఈ లేఖ పంపారు.

అయితే ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి స్వల్ప వరద కొనసాగుతుంది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 84,598 క్యూసెక్కులుగా ఉంటె.. ఔట్ ఫ్లో 68,769 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 881 అడుగుల నీరు ఉంది. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు అయితే ప్రస్తుతం 193.4090 టీఎంసీల నీరు ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news