వినేశ్‌.. నువ్వు మీ పెద్దనాన్నను మరిచిపోయావు: గీతా ఫొగాట్ భర్త

-

స్టార్‌ రెజ్లర్ వినేశ్‌ ఫొగాట్‌ పారిస్ నుంచి భారత్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. దిల్లీ ఎయిర్ పోర్టులో వినేశ్ కు ఘనస్వాగతం లభించింది. అయితే భారత్ కు వచ్చే ముందు వినేశ్ తన సోషల్ మీడియాలో ఉద్వేగభరితమైన పోస్టు పెట్టింది. పారిస్ ఒలింపిక్స్, తనపై అనర్హత వేటు, కోచ్, ఇతర సిబ్బంది అందించిన సాయం, ఫ్యామిలీ సపోర్టు వంటి తన కెరీర్‌కు సంబంధించిన అనేక విషయాలను షేర్ చేసుకుంది. కానీ, ఆమె పెద్దనాన్న మహవీర్‌ గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావించ లేదు.

ఈ నేపథ్యంలోవినేశ్‌ ఫొగాట్‌ సోదరి గీతా ఫోగట్ భర్త, రెజ్లర్ పవన్‌ సరోహా ఈ విషయంపై స్పందించాడు. వినేశ్ ట్వీట్ పై ఆయన చేసిన పోస్టుపై ఇప్పుడు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే.. ‘‘వినేశ్‌, నువ్వు రాసిన పోస్టు బాగుంది. కానీ, నువ్వు మీ పెద్దనాన్న మహవీర్‌ ఫొగాట్‌ను మరిచిపోయావు. నీ రెజ్లింగ్‌ కెరీర్‌కు పునాది వేసిన వ్యక్తి ఆయన. ఆ దేవుడు నీకు స్వచ్ఛమైన తెలివిని ఇవ్వాలని కోరుకుంటున్నా’’ అని పవన్‌ పోస్టు పెట్టాడు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news