ఏపీలో చీడ పురుగులను ఏరి పారేస్తున్న సంస్కర్త… జగన్‌ – లక్ష్మీపార్వతి

ఏపీలో చీడ పురుగులను ఏరి పారేస్తున్న సంఘ సంస్కర్త…ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అని వైసీపీ నేత నందమూరి లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో చెదలుపట్టి, పురుగులు పట్టిన రాజకీయాన్ని ప్రక్షాళన చేస్తున్న సంస్కర్త సీఎం వైఎస్‌ జగన్‌.

అసమానలతో కూడిన వ్యవస్థలను సరిచేసి సమసమాజ స్థాపనకు వైఎస్‌ జగన్‌ కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. వైసీపీ ప్లీనరీ సందర్భంగా నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ… అధికారం కోసం అనేక పార్టీలు పుడతాయి… కానీ వైసీపీ మాత్రం ప్రజలకు ఇచ్చిన మాట కోసం పుట్టిందని స్పష్టం చేశారు.

అన్యాయంగా కేసులు పెట్టి వేధించాలని… ఇలాంటి వివక్ష లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. సీఎం జగన్ యువతకు రోల్ మోడల్ అని నందమూరి లక్ష్మీపార్వతి చెప్పారు. ప్రజల అభిమానం నుంచి వైసీపీ పార్టీ పుట్టిం దని చెప్పారు. అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని… పార్టీ అంటేనే ప్రజల అభిమానం అని వివరించారు.