మంచి జాబ్ కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. కాకినాడ లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ (సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్) జిల్లా కార్యాలయం లో ఫ్లూ పోస్ట్స్ అయితే ఖాళీగా వున్నాయి. ఆసక్తి, అర్హత ఉంటే దరఖాస్తు చేసుకో వచ్చు. ఇక పూర్తి వివరాలు చూస్తే.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ధాన్య సేకరణకు సంబంధించి రెండు నెలల కాలానికి ఒప్పంద ప్రాతిపదికన 825 మందిని ఎంపిక చేయనున్నారు. టెక్నికల్ పోస్టులు, డేటాఎంట్రీ ఆపరేటర్, హెల్పర్ పోస్ట్స్ వున్నాయి.
మరిన్ని వివరాలు చూస్తే.. దీనిలో మొత్తం 825 పోస్టులు ఖాళీగా వున్నాయి. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు అయితే 275 వున్నాయి. బీఎస్సీ (అగ్రికల్చర్/ మైక్రోబయాలజీ/ బయోకెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ)/ బీఎస్సీ(బీజడ్‌సీ)/ బీఎస్సీ (లైఫ్ సైన్సెస్/ డిప్లొమా (అగ్రికల్చర్) ప్యాస్ అయ్యి ఉండాలి. ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ ఉత్తీర్ణులై ఉంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల కి అప్లై చెయ్యవచ్చు.
8, 10వ తరగతి వాళ్ళు అయితే హెల్పర్ పోస్టులకి దరఖాస్తు చెయ్యవచ్చు. అకడమిక్ మార్కులు, పని అనుభవం, అదనపు విద్యార్హతలు చూసారు. టీఏ/ డీఈవో పోస్టులకు 21-40 ఏళ్లు ఉండాలి. హెల్పర్‌కు 18-35 ఏళ్ల మధ్యన ఉండాలి. దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 2, 2023. పూర్తి వివరాలని https://eastgodavari.ap.gov.in/ లో చూడవచ్చు.
.