ఏపీ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి కొట్టుపై మహిధర్ రెడ్డి సంచలన కామెంట్స్

-

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణపై మాజీ మంత్రి మహిధర్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పట్టాభూములు, ప్రైవేటు భూములను తీసుకువెళ్లి ఎండోమెంట్ భూములుగా సూచిస్తూ నమోదు చేయడంపై మహిధర్‌ రెడ్డి ప్రశ్నించారు. మంత్రి నెపాన్ని రెవెన్యూ వారిపై నెట్టడం దారుణమన్నారు.

ఇక ఆ తరువాత ఎండోన్మెంట్‌లో ఓ కమిటీ పరిశీలిస్తుందని చెప్పడం దారుణమని.. త్రీమెన్ కమిటీ ఫోర్ మెన్ కమిటీ అంటే ఎలా అని ప్రశ్నించారు. గతంలో ఎండోమెంట్ భూములు దురాక్రమణ చేయడం చూశామని చెప్పారు. కందుకూరు నియోజకవర్గంలో ప్రైవేటు, పట్టా భూములను దేవాదాయ భూములుగా చూపుతూ దురాక్రమణ చేశారు అని భావిచాల్సి ఉంటుందన్నారు. 694.27 ఎకరాలలో ఎండోన్మెంట్‌కు ఉన్నది కేవలం 15 ఎకరాలు అని.. అయితే మొత్తం దేవాదాయ భూములుగా చూపడాన్ని మహిధర్ రెడ్డి తప్పుపట్టారు. ఇంత జరగుతున్నా డిప్యూటీ సీఎం మంత్రి కొట్టు సమాధానం భాద్యతా రాహిత్యంగా చెప్పడం దారుణమన్నారు మహిధర్ రెడ్డి. 

Read more RELATED
Recommended to you

Latest news