‘మన్ కీ బాత్’ ని రాజకీయాలకు ముడిపెట్టదు – పురందేశ్వరి

-

మన్ కీ బాత్ ని రాజకీయాలకు ముడిపెట్టొద్దని సూచించారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మన్ కీ బాత్ లో సామాజిక అంశాలు, మంచి పనులు ఉంటాయని అన్నారు. జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో జరుగుతున్న మంచి పనులు తెలిసేలా చేసేది మన్ కి బాత్ అని పేర్కొన్నారు. ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే 30 కోట్ల చెట్లను నాటడానికి అక్కడి ప్రభుత్వం ముందుకు వచ్చిందని మోడీ తెలిపారని అన్నారు.

2500 సంవత్సరాల పురాతన విగ్రహాలను అమెరికా నుండి తిరిగి తీసుకువస్తున్నామని మోడీ తెలిపారని.. మధ్యప్రదేశ్లోని విచార్ పూర్ అనే గ్రామాన్ని మినీ బ్రెజిల్ అంటారని తెలిపారు. విచార్ పూర్ లోని పిల్లల్లో ఫుట్ బాల్ క్రీడకి కావలసిన నైపుణ్యం వారి జీన్స్ లోనే ఉందన్నారు. విచార్ పూర్ ఓ చిన్న ఆదివాసి గ్రామం అని తెలిపారు. మన్ కీ బాత్ ప్రజల్లోకి బాగా చొచ్చుకుపోయిందని.. ఆ కార్యక్రమాన్ని రాజకీయాలకు ముడిపెట్టవద్దని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news