బిజెపితో వివాహం.. చంద్రబాబుతో సంసారం – పవన్ కళ్యాణ్ ట్వీట్ కి మంత్రి అమర్నాథ్ కౌంటర్

ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ట్విట్టర్ వేదికగా సెటైర్లు పేల్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ” ఆక్సిమోరాన్ – అంటే విరుద్ధమైన పదాల కలయిక. ఉదాహరణకు.. దేశంలోని అత్యంత ధనిక ముఖ్యమంత్రి పాలనలో పేద ప్రజలు ఉన్న రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్. మన సీఎం సంపద మిగతా సీఎంలందరి కంటే ఎక్కువ. ఏపీ సీఎం క్లాస్ వేరు. ఆంధ్రప్రదేశ్ లో వర్గాలకు తావులేదు. వైసీపీ రాజ్యంలో దౌచరిన్యాలతో ప్రజల్ని బానిసలుగా మార్చుకున్నారు” అంటూ ట్విటర్ వేదికగా మండిపడ్డారు జనసేనాని.

అయితే పవన్ కళ్యాణ్ ట్వీట్ కి కౌంటర్ ఇచ్చారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ” ఆక్సిమోరాణుకు మరికొన్ని ఎగ్జాంపుల్స్.. బిజెపితో వివాహం.. చంద్రబాబుతో సంసారం, హిందీ అమ్మాయితో పెళ్లి, రష్యన్ తో పిల్లలు, అన్న పరువు బజారు పాలు, బాబు నిత్య కళ్యాణ్, చారు మంజుదార్, తరిమెల నాగిరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి పెద్ద పెద్ద పేర్లు ఎందుకు గాని.. ఆ నారా జమీందారు జీవిత చరిత్ర బాగా చదువుకో ” అంటూ కౌంటర్ ఇచ్చారు.