సినిమాల్లో మీసాలు తిప్పుకో… బాలకృష్ణ కు అంబటి కౌంటర్

-

BREAKING : అసెంబ్లీలో మీసాలు తిప్పిన బాలకృష్ణ కు స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చారు మంత్రి అంబటి రాంబాబు నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో మీసం తిప్పాడు. కాసేపటి క్రితమే మొదటి రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అయితే… మొదటి రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు అయిన కాసేపటికే.. అసెంబ్లీ రచ్చ మొదలైంది.

Minister Ambati Rambabu countered Balakrishna
Minister Ambati Rambabu countered Balakrishna

ఏపీ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. ఏపీ స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టారు టీడీపీ సభ్యులు. అనంతరం వాయిదా తీర్మానంపై చర్చకు పట్టు పట్టారు. అలాగే.. చంద్రబాబు అరెస్ట్‌ ను నిరసిస్తూ…టీడీపీ ఎమ్మెల్యే లు అసెంబ్లీ రచ్చ చేశారు.

ఈ తరుణంలోనే నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో మీసం తిప్పాడు. మీ అంతు చూస్తామని బాలయ్య హెచ్చరించాడట. ఇక అదే సమయంలో… నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో మీసం తిప్పడంపై అంబటి కౌంటర్‌ ఇచ్చారు. దమ్ముంటే రా అంటూ అంబటి రాంబాబు సవాల్‌ విసిరారు. మీసాలు తిప్పడాలు సినిమాల్లో చూపించుకోవాలంటూ బాలకృష్ణకు అంబటి రాంబాబు కౌంటర్‌ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news