జనవరి నాటికి గుంతలు లేకుండా రోడ్లన్నీ పూర్తి చేస్తాము : అనగాని సత్య ప్రసాద్

-

140 రోజుల్లో ముఖ్యమంత్రి 5 ఫైల్ల పై సంతకం చేశారు. ప్రతి పేద వాడికి ఈ ప్రభుత్వం అందుబాటులో వుండేలా చర్యలు తీసుకుంటుంది. ప్రపంచం అంతా ఆంధ్రా వైపు చూస్తోంది అని మంత్రి అనగాని సత్య ప్రసాద్ అన్నారు. రాబోయే 23 సంవత్సరాల్లో ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని అభివృధ్ది చేస్తాం. అభివృధ్ది, సంక్షేమం రెండు కళ్ళ లాంటివి. బీజేపీ, జనసేనతో కలిపి కూటమి ప్రభుత్వం అభివృధ్ది చేస్తోంది.

తిరుపతి ఇంకా అభివృధ్ది చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం. పులికాట్ సరస్సు అభివృధ్ది చేయడానికి కలెక్టర్ ప్రణాళికలు రూపొందించారు. తిరుపతిలో భూ కబ్జాలపై చర్యలు తీసుకుంటాం..రిజిస్ట్రేషన్ తదితర అంశాలను పరిశీలించి 15 రోజుల్లో సిఎం వివరాలు చెబుతారు. గాంజ, డ్రగ్స్ కు బానిసైన వారిలో చైతన్యం తీసుకోవడానికి ఎస్పీ చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ లేకుండా చేస్తాము. విద్యుత్ పెంపు విషయంలో ప్రతిపక్షాలు అనవసరపు ప్రచారం చేస్తున్నారు. 2019 నుంచి 24 వరకు విద్యుత్ 9 సార్లు పెంచారు. పేదవారికి ఆత్మ గౌరవం కల్పించే విధంగా గ్రామ పంచాయతీలో అభివృధ్ది చేస్తున్నాం. జనవరి నాటికి పల్లెలో గుంతల రోడ్లు లేకుండా రోడ్లన్నీ పూర్తి చేస్తాము అని మంత్రి అనగాని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news