తెలంగాణ పోలీసులకు మాజీ మంత్రి హరీశ్ రావు వార్నింగ్ ఇచ్చారు. వనపర్తి రైతు ప్రజా నిరసన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. కొంత మంది పోలీసులు అతిగా వ్యవహరిస్తున్నారు.. అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. బిడ్డా మీ పేర్లు డైరీలో రాసుకుంటున్నాం. మా గవర్నమెంట్ వచ్చిన తరవాత మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. కొల్లాపూర్లో శ్రీధర్ రెడ్డి హత్య జరిగి 11 నెలలు అయిన హంతకులను శిక్షించడం లేదని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో ఎంత అన్యాయంగా పాలన జరుగుతుందో మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు హరీశ్ రావు.
సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకుండా తనను రాజీనామా చేయమంటున్నారని పేర్కన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 20లక్షల మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందన్నారు. రేవంత్ వచ్చాక పాత పథకాలను ఆపేశారని.. బతుకమ్మ చీరలు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. వరంగల్ డిక్లరేషన్ లో ఎన్నో హామీలు ఇచ్చారని హరీశ్ రావు గుర్తుకు చేశారు.