జిల్లా సమీక్షా మండలి సమావేశంలో రాజకీయాలకు తావు ఇవ్వలేదు. ప్రకాశం జిల్లా అభివృద్ధి ముఖ్యం అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. జిల్లాకు తలమాణికమైన వెలుగొండ ప్రాజెక్ట్ త్వరతగతిన పూర్తి చేస్తాం అని హామీ ఇచ్చారు. వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి అయితే నెల్లూరు జిల్లాకు సాగు, తాగు నీరు వస్తుంది. జిల్లా ప్రజలకు సాగు, త్రాగు నీరు ఇవ్వటానికి అన్ని రకాలుగా కృషి చేస్తున్నం అని తెలిపారు.
ఇక ఒంగోలు జాతి ఎద్దుల బ్రీడ్ అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నాము. ఇంకా రాష్ట్రంలో అన్ని ఆలయాల్లో స్వచ్ఛమైన నెయ్యినే వాడమని ఆదేశాలు కూడా ఇచ్చాం. అయితే హైస్పిడ్ బోట్లతో పక్క రాష్ట్రంకు చెందిన తమిళనాడు జాలర్లు ప్రకాశం జిల్లా మత్స సంపదను దోచుకొని పోతున్నారు అని ఆరోపించారు మంత్రి. కాబట్టి.. తమిళనాడు అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం అని హామీ ఇచ్చారు ఆనం రామనారాయణ రెడ్డి.