39వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం ఇవాళ జరిగింది. 41వేల కోట్ల టెండర్లను 2014-19లో పిలిచి 38వేల కోట్ల పనులు ప్రారంభించాం. కానీ మధ్యలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఈ సంవత్సరం జులై 24న ఛీఫ్ ఇంజనీర్లతో కమిటీ వేసాం. ఛీఫ్ ఇంజనీర్ల కమిటీ అక్టోబర్ 29న 23 పాయింట్ల నివేదిక ఇచ్చారు. గత టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్లు పిలవాలని నిర్ణయం ఇవాళ సమీక్షలో నిర్ణయించారు. డిసెంబరు 31 లోపల కొత్త టెండర్లు పిలవాలని నిర్ణయించాం.
హైకోర్టు, అసెంబ్లీ ఐకానిక్ టవర్స్ టెండర్లకు జనవరి ఆఖరు లోగా టెండర్లు పిలుస్తాం. ADB, వరల్డ్ బ్యాంక్ వరద పనులను త్వరగా ప్రారంభించాలని అన్నారు. 217 చ.కిమీ లలో మూడు కాలువలు ఉంటున్నాయి. నీరుకొండ, కృష్ణాయపాలెం, శాఖమూరు ల వద్ద రిజర్వాయర్లు, ఉండవల్లి వద్ద 756 క్యూసెక్కుల ఎత్తిపోతలకు.. వైకుంఠపురం వద్ద 5600 క్యూసెక్కుల నీటి ఎత్తిపోతలతో పాటుగా రాజధాని నగరం బయట మూడు రిజర్వాయర్లు పెట్టాలని నిర్ణయించారు. వీటన్నిటికీ సీఆర్డిఏ పై సీఎం సమీక్షలొ అనుమతి లభించింది అని తెలిపారు మంత్రి నారాయణ.