వైసీపీ నేతలు ఇకనైనా ఫేక్ ప్రచారం మానుకోవాలి : బాల వీరాంజనేయ స్వామి

-

వైసీపీ నేతల స్వార్థ రాజకీయాలు సిగ్గుచేటు. కారుమంచి ఘటనలో బాలిక భవిష్యత్ దృష్ట్యా గోప్యంగా నిష్పక్షపాతంగా విచారణ జరుగుతోంది. కానీ వైసీపీ నేతలు పరామర్శ పేరుతో రిమ్స్ వద్ద చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేలా ప్రవర్తించడం దుర్మార్గం అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. నిష్పక్షపాతంగా విచారణ చేస్తున్న అధికారులను బెదిరించడం ఏంటి.. వైసీపీ హయంలో మహిళలపై 2 లక్షలకు పైగా అఘాయిత్యాలు జరిగితే ఏం చర్యలు తీసుకున్నారు.. లేని దిశ చట్టం పేరుతో మహిళలను మోసం చేసింది జగన్ కాదా అని మంత్రి ప్రశ్నించారు.

ఇక మొన్న చిత్తూరు జిల్లాలో తమ కూతురిపై అత్యాచారం జరగలేదని బాలిక తల్లిదండ్రులు చెబుతున్నా. వైసీపీ నేతలు మాత్రం అఘాయిత్యం జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేశారు వైసీపీ నేతలు తమ రాజకీయ లబ్ధి కోసం బాలికల గౌరవానికి భంగం వాటిల్లేలా తప్పుడు ప్రచారం చేయడం దుర్మార్గం. ఇకనైనా వైసీపీ నేతలు ఇకనైనా ఫేక్ ప్రచారం మానుకోవాలి. వైసీపీ నేతల్లాగా తప్పుడు రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదు. ఆదిమూలపు సురేష్ ని నియోజకవర్గ ప్రజలు చీ కొట్టినా తన తీరు మార్చుకోలేదు. కొండపిలో నామీద ముగ్గురు వ్యక్తులు పోటీ చేసి ఒక్కరు గెలవలేకపోయారు. ఇప్పుడు వైసీపీ ఇంచార్జ్ కోసం వారిలో వారే పోటీ పడుతున్నారు. ఎవరొచ్చినా కొండపిలో వైసీపీకి చోటు లేదు అని మంత్రి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news