మరొకరి నుంచి కొట్టుకొచ్చిన పార్టీతో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు – మంత్రి కారుమూరి

టిడిపి అధినేత నారా చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచిన మూడు స్థానాలు చూసి చంద్రబాబు జబ్బలు చరుచుకుంటున్నాడని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాలను చూసి చంద్రబాబు ఎగిరి పడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు కుతంత్రాలు చేసే వ్యక్తి అని ఆరోపించారు మంత్రి కారుమూరి.

టిడిపి కేవలం మూడు సీట్లకే పరిమితం అయింది అన్నారు. వచ్చే ఎన్నికలలో వైసీపీ దే విజయం అని ధీమా వ్యక్తం చేశారు. మరొకరి నుంచి కొట్టుకొచ్చిన పార్టీతో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నాడని.. ఆయన వయస్సు అయిపోయిందని విమర్శించారు. రాబోయే ఎన్నికలలో వైసీపీ 175 స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమమే ధ్యేయంగా వైసిపి ప్రభుత్వ పాలన కొనసాగిస్తుందని.. టిడిపి ఆరోపణలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.