ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రేషన్‌కార్డు దారులకు మంత్రి నాదెండ్ల మనోహర్ గుడ్‌న్యూస్ చెప్పారు. వచ్చే నెల నుంచి బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులను రేషన్‌కార్డు దారులకు పంపిణీ చేస్తామని తెలిపారు మంత్రి నాదెండ్ల మనోహర్. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యంను వైసీపీ పెద్దలు దారి మళ్లించి కోట్లాది రూపాయల అక్రమాలు చేశారని విమర్శించారు.
పేదలకు అందాల్సిన రేషన్‌లో అవినీతి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు.
- గుంటూరు
- నేడు తెనాలి నియోజకవర్గం లో ఇళ్ల స్థలాల లబ్ధిదారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశం…
- గత ప్రభుత్వంలో తెనాలి, కొల్లిపర మండలాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించిన అధికారులు…
- ఇళ్ల స్థలాల కేటాయింపు లో సమస్యలు ఉన్నాయి అంటూ మంత్రి మనోహర్ దృష్టికి తీసుకు వచ్చిన ప్రజలు …
- ఈ నేపథ్యంలో, పెదరావూరు, సిరిపురం, దావులూరు లేఔట్ల లబ్ధిదారులతో, నేరుగా సమావేశం కానున్న మంత్రి మనోహర్…