రాజధాని అమరావతిని 2 ఏళ్లలో పూర్తి చేస్తామని ప్రకటించారు మంత్రి నారాయణ. రాజధాని అమరావతి నిర్మాణం రెండున్నరేళ్లలో పూర్తయ్యేలా చూస్తామని పురపాలకశాఖ మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగాలు గొప్పవని….వారికి తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ప్రస్తుతం అమరావతి పరిస్థితిని అధ్యయనం చేయడానికి ఓ కమిటీని వేస్తామని, ఆ నివేదిక వారానికి రెండు, మూడు నెలలు పడుతుందని తెలిపారు. రాజధాని పరిధిలోని ప్రతి గ్రామంలో నాకు అనుబంధం ఉందన్నారు. 34 వేల ఎకరాల్ని కేవలం 58 రోజుల్లో రాజధాని నిర్మాణానికి రైతులు ఇచ్చారని వివరించారు. రూ. 9వేల కోట్లు ఖర్చుపెట్టి రహదారుల నిర్మాణం తదితర మౌలిక వసతులు కల్పించాం. ఐఏఎస్ లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, నాలుగో తరగతి ఉద్యోగుల వసతి భవనాలు….. గత టీడీపీ ప్రభుత్వంలోనే 70-90% పూర్తయ్యాయని తెలిపారు మంత్రి నారాయణ.