విజయవాడ వరదల్లో కలెక్టరేట్ నుంచి సీఎం చంద్రబాబు పది రోజుల పాటు సమీక్షించారు అని మంత్రి నారాయణ తెలిపారు. చాలా మంది ఇళ్లల్లో ఫర్నిచర్ దెబ్బతింది.. బెడ్స్ పిల్లోలు కూడా దెబ్బతిన్నాయి. కార్లు బండ్లు స్కూటర్లు బాగా దెబ్బతిన్నాయి. ప్రతి ఇంటిలో వరద నష్టం అంచనా వేశాం. అయితే నష్టం అంచనా సమయంలో కొంత మంది ఇళ్లల్లో లేరు. దెబ్బతిన్న ఇళ్ళు నీళ్లలో ఉండిపోయిన ఇళ్ళు.. బాగా ఉన్నాయి. మొత్తం 53,399 ఇళ్ళు నీళ్లలో ఉండిపోయాయి.
ఈ వరదల్లో 36,000 టూ వీలర్లు.. 2 వేలు కార్లు ఇతర వాహనాలు నీళ్లలో ఉన్నాయి. 26,545 టీవీలు, ఫ్రిజ్ లు 31 వేలు, వాషింగ్ మెషీన్లు 20 వేలకు పైగా దెబ్బతిన్నాయి. అలాగే మొత్తం రూ. 5000 కోట్ల నష్టం వ్యవసాయ రంగానికి జరిగింది. రేపు సాయంత్రానికి వరద నష్టం అంచనా పూర్తి అవుతుంది. ఆ తర్వాత ఎవరికి ఎంత నష్ట పరిహరం ఇవ్వాలనేది సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారు అని మంత్రి నారాయణ స్పష్టం చేసారు.