అమరావతి సచివాలయంలో వెలిగొండ, హంద్రినీవ, పోలవరం మరియు పోలవరం ఎడమ కాలువ పనులపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ఇరిగేషన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, ఈఎన్సీ ఎం. వెంకటేశ్వరరావు, సంబంధిత ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన వెలిగొండ ప్రాజెక్ట్ పనులు పూర్తవ్వలేదు. చంద్రబాబు ఆదేశాలతో ఈవారంలో వెలిగొండ ప్రాజెక్ట్ సందర్శించి పనులను అత్యంత వేగవంతం చేస్తాం. వెనుకబడిన ప్రకాశం జిల్లా ప్రజలకు తాగునీరు ,సాగు నీరు అందించడమే చంద్రబాబు లక్ష్యం. హంద్రీనీవ ప్రాజెక్ట్ ప్రధాన కాలువ విస్తరణ, లైనింగ్ పనులు నవంబర్ లో మొదలు పెట్టెలా ప్రణాళికలు సిద్ధం చేసి షెడ్యూల్ ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే పోలవరం లెఫ్ట్ కెనాల్ పై గత 5 సంవత్సరాల పాలనలో ఒక్క అరబస్తా సిమెంట్ గానీ, ఒక్క రూపాయు గానీ ఖర్చు పెట్టని జగన్ పోలవరం కాలువపై మాట్లాడే అర్హత ఎక్కడుంది. ఎంత ఖర్చు అయినా వెనుకాడకుండా ఉత్తరాంధ్రకు తాగు నీరు, సాగు నీరు అందించాలనే, చంద్రబాబు పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులను ప్రారంభిస్తున్నారు అని పేర్కొన్నారు.