ప్రత్యేక హోదాపై మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది : వైసీపీ ఎంపీ

ప్రత్యేక పరిస్థితుల్లో వర్షాకాల సమావేశాలు జరగబోతున్నాయని లోకసభ లో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మిథున్ రెడ్డి పేర్కొన్నారు. కరోనా నియంత్రణ చర్యలు, భారత్ – చైనా సరిహద్దు వివాదాలు, రాష్ట్రాలకు జిఎస్ స్టి నిధుల విడుదల వంటి అంశాలపై చర్చించాలని స్పీకర్ ని కోరామని ఆయన అన్నారు. పార్లమెంట్ బిజినెస్ అడ్వైజరీ కమిటీ బీఏసీ సమావేశం తరువాత కామెంట్స్ చేశారు.

అవకాశం వచ్చిన ప్రతి సారి ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతూనే ఉంటామని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక హోదా అంశం మీద మా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి హామీని నెరవేర్చుతున్నందున, విమర్శించేందుకు వేరే ఏ అంశాలు లేకే మాపై ప్రతిపక్షాలు నిందలు వేస్తున్నాయని మిధున్ రెడ్డి పేర్కొన్నారు. కరెంట్ మీటర్ల విషయంలో ఎవరూ ఆందోళనలో లేరని ఆయన పేర్కొన్నారు. ఉచిత విద్యుత్ కొనసాగుతుందని సీఎం జగన్ స్పష్టం చేశారని మిధున్ రెడ్డి పేర్కొన్నారు.