ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో… ఇటీవల కూటమి ప్రభుత్వం వచ్చిన సంగతి తెలిసిందే. టిడిపి ఇందులో ఎక్కువ సీట్లు గెలిచింది. ఈసారి చాలామందికి కొత్తవారికి… చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. అలాంటి వారిలో ఎమ్మెల్యే శిరీష ఒకరు. తెలుగుదేశం మహిళా ఎమ్మెల్యే శిరీష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.యంగ్ అండ్ డైనమిక్ లీడర్. అయితే ఈ టిడిపి ఎమ్మెల్యే శిరీష మంచి మనసు చాటుకున్నారు.
తన నియోజకవర్గ ప్రజల కష్టాలను తీర్చేందుకు రంగం సిద్ధం చేశారు. తన సొంత డబ్బులతో ఓ అంబులెన్స్ కూడా రెడీ చేశారు. ఇటీవల రంపచోడవరంలో… ప్రభుత్వాసుపత్రిలో ఓ మహిళ మరణించింది. అయితే ఆ మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు అక్కడ అంబులెన్స్ లేదు. ఈ విషయం ఎమ్మెల్యే శిరీష దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఓ అంబులెన్స్ మాట్లాడి మృతదేహాన్ని… వాళ్ల స్వగ్రామనికి చేర్చారు. అంతే కాదు తన సొంత డబ్బులతో ఓ కొత్త అంబులెన్స్ కూడా ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే శిరీష. ఈ వాహనాన్ని ఆగస్టు 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు ప్రారంభిస్తామని తెలిపారు.