తన కుటుంబమే తనపై దాడి చేస్తోందని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పేర్కొన్నారు. కుటుంబ వ్యవస్థలో భర్త నిర్ణయానికి భార్య కట్టుబడి ఉండాలని.. కానీ నా భార్య అలా ఉండటం లేదన్నారు. వాణీకి రాజకీయ ఆకాంక్ష చాలా ఎక్కువ అని ఆరోపించారు. ఒక కూతురు పెళ్లి చేశానని.. మరో కూతురు పెళ్లి చేయాల్సి ఉందని తెలిపారు. ఏ జనమలో చేసిన పాపమో ఆమెను పెళ్లి చేసుకున్నాను. 1994లో పెళ్లి చేసుకున్నాను. 2024 కి నా పెళ్లి జరిగి 30 ఏళ్లు అవుతుందని.. ఈ 30 ఏళ్లు నరకం చూపించిందని తెలిపారు.
రెండేళ్ల నుంచి నేను.. నా భార్య విడిగానే ఉంటున్నామని తెలిపారు. తన తల్లిని ఎప్పుడు కలిసేందుకు వెళ్లిన తనతో గొడవ పడేదని.. అప్పటి నుంచి తాను తల్లికి దూరమయ్యానని వెల్లడించారు. ఇప్పుడే సంతోషంగా ఉంటున్నానని.. మళ్లీ రౌడీమూకలతో తనపై దాడికి వచ్చిందని తెలిపారు. మైన్ ను తన పేరు మీద మార్చాలని వాణి ఒత్తిడి చేసేదని.. క్వారీ వద్దకు వెళ్లి డబ్బులన్నీ తనకే ఇవ్వాలంటూ రచ్చ రచ్చ చేసేదని ఆరోపించారు దువ్వాడ శ్రీనివాస్. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.