ఫ్రభుత్వాలు, అధికారాలు ఎవరికి శాశ్వతం కాదు. కోర్టుల దగ్గర రెడ్ బుక్ రాజ్యాంగం చెల్లదు అని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. 200 మంది పోలీసులు వచ్చి ధ్వంసం చేశారు. ల్యాండ్ సీలింగ్ కేసు ఉందని నా కుటుంబ సభ్యులు చెరువులు ధ్వంసం చేశారు. అడిగితే ఈ భూమి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ లో ఉందని అధికారులు చెప్తున్నారు. 2005లో ఈ భూమి నేను కొన్నాను. రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్ ప్లస్ ల్యాండ్ కాదని గతంలోనే చెప్పారు.
ఆర్డీఓ నెల రోజుల కిందట నోటీసు ఇచ్చారు..దానికి సమాధానం ఇచ్చాము. 11 ఎకరాల 38 సెంట్లు ఎక్కువ ఉందని తీసుకుంటున్నాము అని చెప్తున్నారు. వైసీపీ కి చెందిన వ్యక్తి అని నన్ను టార్గెట్ చేశారు. 151 చోట్ల గెలిచిన జగన్ కి 11 సీట్లు వచ్చాయి. ప్రజలు ఆలోచనలు ఎప్పుడు ఒకే లా ఉండవు. సీఎం, డిప్యూటీ సీఎంలు ఒక సారి ఆలోచించాలి. ఈ దుర్మార్గం, అన్యాయం ఏంటో అర్థం కావడం లేదు. ఇలాంటి ఆలోచనలు ఉంటే ఏ గతి పడుతుందో చూడాలి. అధికారులు ఎవరిని సంతృప్తి పరచడానికి ఈ పనులు చేస్తున్నారు అని తోట త్రిమూర్తులు ప్రశ్నించారు.