త్వరలోనే టీడీపీలో చేరతున్నానని ప్రకటించారు వైసీపీ రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి ఓడిపోయిందని..అధికారం లేదని పార్టీ వీడటం లేదన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో..నాకు ఉన్న ఇబ్బందులు సమస్యల తో వైఎస్ఆర్సీపీ వీడాలని నిర్ణయం తీసుకున్నానని ప్రకటించారు. ఒక పార్టీలో పదవి పొంది మరో పార్టీలో చేరడం సరికాదు కాబట్టి రాజ్యసభ పదవికి రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు.
గత ఎన్నికల సమయంలో నాకు టికెట్ నిరాకరించడంతో మనస్తాపం చెందానని…అప్పుడే ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకున్నానని వెల్లడించారు. కానీ నాకు ఇచ్చిన ప్రాధాన్యత దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోలేదని… నేను తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకున్నది కాదు. చాలా రోజులుగా అసంతృప్తితో ఉన్నానని బాంబ్ పేల్చారు. కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు ఇచ్చినా ప్రజలు వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని… ఇప్పటికి ఓటమిపై సమీక్ష జరగలేదు..భవిష్యత్తు లో లోటుపాట్లపై సమీక్ష చేసుకుంటారనుకుంటున్నానని చెప్పారు. నాకు రాజ్యసభకు రావడం ఇష్టం లేదు. నిత్యం ప్రజల్లో ఉండాలని కోరుకునే వ్యక్తిని అన్నారు. పార్టీని వీడొద్దు పార్టీలోనే ఉండాలని వైసిపి పెద్దలు నాతో మాట్లాడారు..నా సమస్యలు వారికి చెప్పానని పేర్కొన్నారు మోపిదేవి వెంకటరమణ.