సీబీఐ విచారణకు మేము సిద్ధంగా ఉన్నాం : కేశినేని చిన్ని

-

మనోభావాలను దెబ్బ తీసిన జగన్ ను వెంటనే అరెస్టు చేయాలి. అప్పట్లో దేవాదాయ శాఖా మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి ని కూడా అరెస్టు చేయాలి అని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. అప్పటి టీటీడీ బోర్డులో ప్రస్తుతం ఉన్న అనేకమంది సీనియర్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, విచారించి వారిపైనా చర్యలు తీసుకోవాలి. అప్పటి టీటీడీ బోర్డు లో ఉన్నవాళ్లు ఇప్పుడు టీడీపీ లో ఉంటే వాళ్ళపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అయినా బోర్డు తో సంబంధం లేకుండా చాలా నిర్ణయాలు తీసుకున్నారు అని అన్నారు.

అలాగే సీబీఐ విచారణకు మేము సిద్ధంగా ఉన్నాం. సిట్టింగ్ జడ్జి తో అయినా విచారణకు సిద్ధం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో దేవుడికి ప్రసాదం పెట్టే నేతిలో కూడా అవినీతి చోటు చేసుకుందంటే ఇంతకంటే దారుణం ఏముంది. అందుకే ప్రజా సంఘాలు జగన్ ఇంటి వద్ద ధర్నాలు చేస్తున్నాయి. “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమానికి వచ్చే రెస్పాన్స్ చూస్తుంటే వరదలను ఎంత సమర్ధంగా ఎదుర్కొన్నామో తెలుస్తుంది అని ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version